మూడు సినిమాలతో శర్వా !

Sunday,August 18,2019 - 03:20 by Z_CLU

ప్రస్తుతం ‘రణరంగం’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న శర్వానంద్ నెక్స్ట్ రెండు సినిమాలను సిద్దం చేస్తున్నాడు. అందులో ఒకటి ’96’ రీమేక్ కాగా మరొకటి ‘శ్రీకారం’. ఇప్పటికే ’96’ సినిమాకు సంబంధించి సగం షూట్ పూర్తి చేసిన శర్వా ప్రస్తుతం ‘శ్రీకారం’ షూట్ లో బిజీ గా ఉన్నాడు. శ్రీకారం మొదటి షెడ్యుల్ పూర్తి చేసి మళ్ళీ 96 కి షిఫ్ట్ అవుతాడు. ఈ రెండు సినిమాలను ఒకే టైంలో పూర్తి చేసి ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి రాగానే  తెలుగు, తమిళ్ లో బైలింగ్వెల్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. శర్వా చేతిలో ప్రస్తుతం ఈ మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలతో ఈ యంగ్ హీరో ఎలాంటి విజయాలు అందుకుంటాడో..చూడాలి.