గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్.. త్వరలోనే ఫస్ట్ లుక్

Thursday,December 20,2018 - 11:01 by Z_CLU

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పట్లో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ కూడా వేశారు. దాదాపు 50శాతం షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఇప్పుడా మూవీ డీటెయిల్స్ ను బయటపెట్టాడు శర్వానంద్.

సుధీర్ వర్మ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించబోతున్నట్టు స్పష్టంచేశాడు శర్వానంద్. 1980 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ప్రజెంట్, పాస్ట్ షేడ్స్ లో శర్వానంద్ ను ఇందులో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు శర్వ.

ప్రస్తుతం పడిపడి లేచే మనసు సినిమా ప్రచారంలో ఉన్న శర్వానంద్, ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్ లో శర్వానంద్ సినిమాను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించాడు. కల్యాణి ప్రియదర్శన్
హీరోయిన్ గా నటిస్తోంది.