డాన్ గెటప్ లోకి షిఫ్ట్ అయిన శర్వానంద్

Thursday,April 05,2018 - 07:03 by Z_CLU

రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పడిపడి లేచె మనసు’  సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాడు శర్వానంద్. కలకత్తాలో నెల రోజుల పాటు జరిగిన భారీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ లోపు ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం ఇష్టం లేని శర్వా, సుదీర్ వర్మ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేశాడు.

ఇవాళ్టి నుండి వైజాగ్ లో 2 వారాల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న సుధీర్ వర్మ & టీమ్, సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు. మహానుభావుడు సక్సెస్ తరవాత ఇమ్మీడియట్ గా 2 సినిమాలను బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేసిన శర్వా, అటు ‘పడి పడి లేచే మనసు’ లో లవర్ బాయ్ లా, ఇటు సుదీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాఫియా డాన్ లా నటిస్తున్నాడు.

ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది సుధీర్ వర్మ టీమ్. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శర్వా సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది.