సంక్రాంతికి మరో సినిమా రెడీ

Monday,July 01,2019 - 12:51 by Z_CLU

ఇప్పటికే సంక్రాంతి బెర్తులు నిండిపోయాయి. మహేష్-అనీల్ రావిపూడి సినిమాను సంక్రాంతికే ప్లాన్ చేశారు. నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టు కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. మరోవైపు బాలయ్య కూడా తన కొత్త సినిమాను సంక్రాంతికే ప్లాన్ చేశారు. ఇప్పుడీ రేసులోకి శర్వానంద్ కూడా వచ్చిచేరాడు. తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఓపెనింగ్ రోజునే ప్రకటించాడు శర్వా.

శ‌ర్వానంద్ హీరోగా `శ్రీకారం` అనే కొత్త సినిమా ప్రారంభమైంది. డైరెక్ట‌ర్ సుకుమార్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా..ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫర్. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయబోతున్నారు.

కథ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కిశోర్ రెడ్డి
బ్యాన‌ర్‌: 14 రీల్స్ ప్లస్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌
సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌పీ: యువ‌రాజ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాశ్ కొల్ల‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీశ్ క‌ట్టా