ఈసారి కూడా అక్కడే...

Thursday,October 06,2016 - 09:00 by Z_CLU

కొత్త సెంటిమెంట్ తో దూసుకుపోవాలని చూస్తున్నాడు శర్వానంద్. గతేడాది సంక్రాంతి బరిలో పెద్ద హీరోలతో పాటు ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లి కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ సెంటిమెంట్ తో మరో సారి సంక్రాంతి పై కన్నేశాడు.
ఈసారి దిల్ రాజు తో కలిసి ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి పోటీలో నిలిచాడు శర్వ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు.

     express_raja_movie_stills_sharwanand_surabhi_2af1b71

       2016 సంక్రాంతి కి తన సినిమాతో మంచి కలెక్షన్స్ అందుకున్న శర్వా కూడా వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తో ఈ కుర్ర హీరో మరోసారి సంక్రాంతి వీరుడు గా నిలుస్తాడా? లేదో చూడాలి. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హేమాహేమీలతో పోటీపడిన శర్వ… వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి బాలయ్యతో పోటీపడుతూనే… ఫస్ట్ టైం మెగాస్టార్ తో కూడా తలపడబోతున్నాడు.