డిఫరెంట్ స్టైలిష్ లుక్ తో శర్వా ...

Sunday,January 28,2018 - 01:55 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో జోరుమీదున్న యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా రెండు సినిమాలను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి, సుదీర్ వర్మ డైరెక్షన్ లో రెండు సినిమాలు చేయబోతున్న శర్వా హను తో రూపొందే సినిమాను ముందుగా సెట్స్ పై పెట్టడానికి రెడి అవ్తున్నాడట. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం శర్వా ఓ స్టైలిష్ ఆద్వర్యంలో న్యూ లుక్ ట్రై  చేశాడని ఈ లుక్ టీం అందరికీ నచ్చడంతో ఈ లుక్ లో ఫోటో షూట్ చేసి లుక్ ఫైనల్ చేశారని సమాచారం.

లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కలకత్తా లో ఓ నెల పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా నేపాల్ లో రెండో షెడ్యుల్ జరుపుకోనుంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.