ఎట్టకేలకు వస్తున్న 'శంకర'

Saturday,August 20,2016 - 09:50 by Z_CLU

నారా రోహిత్ హీరోగా న‌టించిన `శంక‌ర‌` సెప్టెంబ‌ర్ 16న విడుద‌లకానుంది. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తాతినేని స‌త్య ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళంలో చ‌క్క‌టి విజ‌యాన్ని సొంతం చేసుకున్న `మౌన‌గురు` చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కింది. అక్కడ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే సినిమాకు చిన్న మార్పులు చేసి, దర్శకుడు మురుగుదాస్ హిందీలో అకిరా పేరుతో తీశాడు. ఇప్పుడిదే కథ తెలుగులో నారా రోహిత్ హీరోగా శంకర పేరుతో విడుదలకు సిద్ధమైంది. తమిళ మాతృకకు ఏమాత్రం మార్పులు చేయకుండా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు.. ఉన్నది ఉన్నట్టుగా దీన్ని రీమేక్ చేశారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. గత 2 సినిమాలతో సరైన విజయాలు అందుకోలేకపోయిన నారా రోహిత్… శంకర సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. జాన్ విజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి టి.సురేందర్‌ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరించారు.