నలుగురు హీరోలు.. ఒక కారు.. శమంతకమణి

Thursday,June 15,2017 - 10:44 by Z_CLU

శమంతకమణి.. టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసిన సినిమా. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన రెండో ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. గతంలో సుధీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమా చేశాడు ఈ దర్శకుడు. ఈసారి ఏకంగా నలుగురు హీరోలతో శమంతకమణి సినిమా తెరకెక్కించాడు. మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసింది ఈ సినిమా. తాజాగా టీజర్ లాంచ్ చేశారు.

శమంతకమణి సినిమాలో నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు హీరోలుగా నటించారు. సినిమా మొత్తం ఓ కారు చుట్టూ తిరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిచే ఈ కథలో కామెడీని తనదైన స్టయిల్ లో మిక్స్ చేశాడు ఆదిత్య. టీజర్ కు ఫినిషింగ్ టచ్ గా రాజేంద్రప్రసాద్ ను పెట్టడంతోనే దర్శకుడి టైమింగ్ అర్థమౌతోంది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాలో నలుగురు హీరోలు ఉన్నప్పటికీ వాళ్ల క్యారెక్టర్స్ ఏంటి.. నలుగురిలో తెరపై ఎంతమంది ఒకేసారి కనిపిస్తారనే ఎలిమెంట్స్ సస్పెన్స్ గా మారాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.