రాజ్ తరుణ్ సరసన అర్జున్ రెడ్డి బ్యూటీ !

Wednesday,May 01,2019 - 11:02 by Z_CLU

‘లవర్’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్, దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ తో యూత్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జి.ఆర్. కృష్ణ దర్శకుడు. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలినీ పాండే ని తీసుకున్నారట.

మొన్నటి వరకూ ఈ సినిమాకు హీరోయిన్ గా మేఘా ఆకాశ్ పేరు వినిపించింది. అయితే మేఘా ఆకాష్ కి బదులు ఇప్పుడు షాలినీ పాండే ను ఫైనల్ చేశారట. త్వరలోనే హీరోయిన్ గా షాలినీ పేరు ప్రకటిస్తారు.  త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.