Shakeela - ఈసారి తెలుగులో..!

Sunday,December 27,2020 - 12:02 by Z_CLU

షకీలా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం. 1990లో సౌత్ లో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్ బయోపిక్ ఇది. అప్పట్లో ఆమె మూవీస్ కు మంచి క్రేజ్ ఉండేది. ప్రతి వారం ఆమె సినిమా రిలీజయ్యేది, సూపర్ స్టార్ మూవీస్ కు పోటీగా నిలిచేది.

ఈ Shakeela కు ఇంద్ర‌జీత్ లంకేశ్.. ర‌చ‌న-ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రీచా చద్దా, పంక‌జ్ త్రిపాటి, ఎస్త‌ర్ నోర‌న్హ‌, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్ మ‌రియు సందీప్ మ‌ల‌ని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

సినిమాలో షకీలా పాత్రలో రిచా చద్దా నటించగా.. సూపర్ స్టార్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, షకీలాకు బాడీ డబుల్ గా ఎస్తర్ నోరన్హ నటించారు. ఈ సినిమాను హిందీలో షూట్ చేసి, అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు.

Shakeela-Telugu-january-1-release-richa-chadda-1

UFO MOVIEZ హిందీ / తమిళ & కన్నడ వెర్షన్‌ను 25 డిసెంబర్ న పాన్ ఇండియా లెవ‌ల్లో 900ల‌కు పైగా స్క్రీన్‌లలో విజయవంతంగా విడుదల చేసింది. ఇప్పుడు జనవరి 1న తెలుగులో రిలీజ్ చేస్తోంది.

ఈ సినిమా పాటలు జీ మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.