షకలక శంకర్ ఇంటర్వ్యూ

Thursday,June 28,2018 - 05:02 by Z_CLU

‘శంభో శంకర’ సినిమాతో కమెడియన్ షకలక శంకర్ హీరోగా టర్న్ అవుతున్నాడు. ఈ నెల 29 న రిలీజవుతున్న ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న షకలక శంకర్ ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అది నా రేంజ్…

కమెడియన్ గా నాకు నా రేంజ్ అవకాశాలు రాకపోవడంతో ఈ సినిమాలో హీరోగా చేశాను. ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలోలా జాబ్ స్యాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చే క్యారెక్టర్స్ చేయాలని ఉంది.

పనికోసమే చేశా…

చేతిలో పని లేక ఈ సినిమా చేశా.. ఏదో హీరో అయిపోదామనుకుని మాత్రం కాదు…

 

అలాంటి ఆశ లేదు…

సినిమాలో డ్యాన్సులు చేసేయాలి.. ఫైట్స్ చేసేయాలి అనే ఆశ నాకెప్పుడూ లేదు.. ఈ కథకి ఆ అవసరం కాబట్టి చేయాల్సి వచ్చింది.

నేనదే నమ్ముతా

నేను నిజాయితీగా ఉండటాన్నే నమ్ముతా… అవకాశాలు లేకపోతే వెళ్లి ఒక అవకాశం ఇవ్వమని అడగటంలో తప్పులేదు…

అందరి సపోర్ట్…

దిల్ రాజు గారు సాంగ్, హరీష్ శంకర్ టీజర్ రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ గారితో కూడా ఏదో ఒకటి రిలీజ్ చేయిద్దాము అనుకున్నాము. కానీ ఆయన NTR గారి సినిమాతో బిజీగా ఉన్నారు కుదరలేదు…

అసిస్టెంట్ డైరెక్టర్ లా చేశాను…

ఈ సినిమాలో జస్ట్ యాక్ట్ చేయడమే కాదు… అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను.. స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యాను…

నాకు ఆడియెన్స్ పల్స్ తెలుసు…

సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి… నాకు డైరెక్టర్ శ్రీధర్ కి ఆడియెన్స్ పల్స్ తెలుసు.. వాళ్ళను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలో.. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి సినిమాలో…

నేనలా అనుకోలేదు…

నేను పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయాలి అనుకోలేదు.. అలా జరిగిపోయింది… ట్రైలర్ చూసిన వాళ్ళంతా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నావ్ గా అంటున్నారు…

మంచి యాక్టర్ అనిపించుకుంటా…

ఈ సినిమాతో స్టార్ అనిపించుకోవడం కన్నా మంచి యాక్టర్ అనిపించుకుంటా.. ఆ నమ్మకమైతే నాకుంది..