శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ రిలీజ్ వాయిదా

Wednesday,August 29,2018 - 11:43 by Z_CLU

నాగార్జున పుట్టినరోజు కానుకగా ఈరోజు విడుదల కావాల్సిన శైలజారెడ్డి అల్లుడు సినిమా ట్రయిలర్ ను పోస్ట్ పోన్ చేశారు. నటుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హఠాన్మరణంతో యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది.

కేరళ వరదల కారణంగా శైలజారెడ్డి అల్లుడు సినిమా వాయిదా పడింది. లేదంటే ఎల్లుండికి ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. ఇప్పుడు హరికృష్ణ ఆకస్మిక మరణంతో ట్రయిలర్ లాంఛ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే థియేట్రికల్ ట్రయిలర్ వాయిదాపడినా, సినిమా మాత్రం సెప్టెంబర్ 13నే వస్తుందని కన్ ఫర్మ్ చేశారు.

 

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మారుతి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు ఇప్పటికే హిట్ అవ్వడం సినిమాకు మరింత ప్లస్ అయింది.