ఫస్ట్ డే కలెక్షన్: చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ ఓపెనర్

Friday,September 14,2018 - 12:29 by Z_CLU

నాగచైతన్య-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు సినిమా వినాయక చవితి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు వసూళ్ల ప్రకారం, ఈ మూవీ నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అంతేకాదు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా కూడా నిలిచింది శైలజారెడ్డి అల్లుడు.

కంప్లీట్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన శైలజారెడ్డి అల్లుడు సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ డే 5 కోట్ల 36 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తాజా వసూళ్లతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ను క్రాస్ చేసి, తన రికార్డును తానే బద్దలుకొట్టాడు చై. ఈ ఏడాది అజ్ఞాతవాసి, భరత్ అనే నేను, రంగస్థలం, నా పేరు సూర్య, గీతగోవిందం లాంటి సినిమాలు బిగ్గెస్ట్ ఓపెనర్స్ గా నిలవగా.. అలాంటి సినిమాల సరసన శైలజారెడ్డి అల్లుడు కూడా చేరింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్ (షేర్)
నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 1.04 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.40 కోట్లు
గుంటూరు – రూ. 0.58 కోట్లు
కృష్ణా – రూ. 0.39 కోట్లు
నెల్లూరు – రూ. 0.23 కోట్లు