మంగ్లీ ఇంటర్వ్యూ

Saturday,September 08,2018 - 10:05 by Z_CLU

శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ సాంగ్ ది డెఫ్ఫినేట్ గా స్పెషల్ ప్లేస్. అత్తకు, గర్ల్ ఫ్రెండ్ కి మధ్య నలిగే నాగ చైతన్య రోల్ చుట్టూ తిరిగే లిరిక్స్, మాస్ ఆడియెన్స్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ కి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యాయి. దానికి తోడు మంగ్లీ వాయిస్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మంగ్లీ షేర్ చేసుకున్న మాటలు మీ కోసం…

సినిమా జర్నీ…

ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో పాడాను కానీ అంతలా గుర్తింపు రాలేదు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో పాడే అవకాశం దొరకడం, అందునా టైటిల్ సాంగ్ అవ్వడంతో చాలా హ్యాప్పీగా ఉంది.

అలా జరిగింది…

మారుతి గారు డిఫెరెంట్ వాయిస్ ఉంటే బావుంటుంది ఈ సాంగ్ కి అన్నప్పుడు, కాసర్ల శ్యామ్ గారు నా సాంగ్స్ వినిపించారట మారుతి గారికి. అప్పుడు ఆయన నన్ను పిలిపించడం, వాయిస్ టెస్ట్ చేయడం, ఓకె చేయడం జరిగింది.

అద్భుతమైన రెస్పాన్స్…

అన్ని వైపుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. గోపిసుందర్ కంపోజ్ చేసిన సాంగ్ పాడటమన్నది నిజంగా అదృష్టంగా ఫీలవుతున్నా.

సినిమాలో కూడా…

ఈ సాంగ్ విజువల్స్ లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంటా. బంజారా డ్రెస్ లో ఉంటా.

ప్రాక్టీస్ చేశా…

కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ ఇచ్చినప్పుడు బిగినింగ్ లో అవి పలకడానికి కూడా ఇబ్బంది పడ్డా… రికార్డింగ్ కి వెళ్ళే ముందు చాలా ప్రాక్టీస్ చేశా.