డేట్ ఫిక్స్ చేసిన శైలజారెడ్డి అల్లుడు

Tuesday,July 31,2018 - 10:50 by Z_CLU

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సెన్సేషనల్ డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శైలజారెడ్డి అల్లుడు. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 31న శైలజారెడ్డి అల్లుడు సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్టు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ప్రకటించింది.

నాగచైతన్య-అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మారుతి దర్శకుడు. సీనియర్ నటి రమ్యకృష్ణ, శైలజారెడ్డి పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే టీజర్ తో కూడా సందడి చేయనుంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ ప్రజెంట్ చేస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.