మరికొన్ని గంటల్లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Sunday,September 09,2018 - 09:49 by Z_CLU

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా శైలజారెడ్డి అల్లుడు. వినాయక చవితి కానుకగా ఈనెల 13న గ్రాండ్ గా ఈ సినిమా విడుదలకానుంది. ఈలోగా మూవీకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటుచేశారు. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి శైలజారెడ్డి అల్లుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరగబోతోంది.

హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పాసులు దొరకని వాళ్లు బాధపడాల్సిన పనిలేదు. ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను జీ సినిమాలు ఛానెల్ లో ఎక్స్ క్లూజివ్ గా చూడొచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారమౌతుంది.

ఇక శైలజారెడ్డి అల్లుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది. ఈ ఫంక్షన్ కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. సో.. ఒకే స్టేజ్ పై నాగ్, నాగచైతన్య, నాని… ఇలా ముగ్గురు హీరోలు మెరవబోతున్నారన్నమాట.