శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ వీక్ వసూళ్లు

Thursday,September 20,2018 - 01:01 by Z_CLU

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది శైలజారెడ్డి అల్లుడు సినిమా. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ఈ సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 16 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో 3 కోట్లు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

 

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్

నైజాం – రూ. 6.04 కోట్లు
సీడెడ్ – రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.37 కోట్లు
ఈస్ట్ – రూ. 1.44 కోట్లు
వెస్ట్ – రూ. 0.91 కోట్లు
గుంటూరు – రూ. 1.46 కోట్లు
కృష్ణా – రూ. 0.93 కోట్లు
నెల్లూరు – రూ. 0.56 కోట్లు