‘జెర్సీ’ కోసం తప్పలేదు

Saturday,November 02,2019 - 09:02 by Z_CLU

‘జెర్సీ’ కోసం నాని క్రికెట్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అదే ‘జెర్సీ’ కోసం షాహిద్ కపూర్ క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా హిందీ వర్షన్ లో హీరోగా నటించనున్నాడు షాహిద్ కపూర్.

‘జెర్సీ’ సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ ని గెస్ చేశాడు నాని. అందుకే కొద్దో గొప్పో తెలిసిన క్రికెట్ తో అయిందనిపించుకోకుండా ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకుని మరీ, ఈ క్యారెక్టర్ లో నటించాడు. అదే ఫార్ములాని ఇప్పడు షాహిద్ ఫాలో అవుతున్నాడు.

రీసెంట్ గా ‘కబీర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ ట్రాక్ లో పడ్డ షాహిద్, ఇప్పుడు ‘జెర్సీ’ ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. నాని లాగే ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ ని హైర్ చేసుకుని మరీ, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

బేసిగ్గా స్టార్ హీరోలకు క్రికెట్ పరిచయమే. మామూలుగా సినిమాలో ఎక్కడో ఓ చోట క్రికెట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే ఇంత ట్రైనింగ్ ప్రాసెస్ అవసరం ఉండేది కాదేమో. కానీ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం నాని తీసుకున్న నిర్ణయమే షాహిద్ కపూర్ తీసుకున్నాడు.