'షాదీ ముబారక్' రిలీజ్ ఫిక్స్ !

Thursday,February 11,2021 - 12:42 by Z_CLU

సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘షాదీ ముబారక్‌’ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. వీర్ ‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మార్చ్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

పద్మ శ్రీ దర్శకత్వంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అజయ్‌ ఘోష్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు  సునీల్‌ కశ్యప్ మ్యూజిక్ అందిస్తునాడు. త్వరలోనే ఆల్బం నుండి సాంగ్స్ రిలీజ్ కానున్నాయి.‌