Shaakutalam సమంత బర్త్ డే పోస్టర్
Thursday,April 28,2022 - 02:53 by Z_CLU
Shaakuntalam team wishes Samantha with a Birthday Poster
సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ గుణ శేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ మూవీ ‘శాకుంతలం’ నుండి మరో పోస్టర్ వచ్చింది. ఇటివలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ నేడు సమంత పుట్టిన రోజు సందర్భంగా ఓ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసి విష్ చేశారు. నాలుగు స్థంబాల మధ్య తెల్లని దుస్తులతో సమంత శకుంతలగా కనిపిస్తూ ఉన్న స్టిల్ తో రిలీజైన ఈ పోస్టర్ ప్రెజెంట్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఇంప్రెస్ చేస్తుంది.

ఇటివలే సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎడిటింగ్ , డబ్బింగ్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. సమంత శకుంతల పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దేవ్ మోహన్ దుష్యంత్ రోల్ ప్లే చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ ఇందులో చైల్డ్ కేరెక్టర్ లో కనిపించనుంది.
దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బేనర్ పై నీలిమ గుణ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు.
-
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics