'షాదీ ముబారక్' ట్రైలర్ రివ్యూ

Thursday,February 25,2021 - 07:09 by Z_CLU

సాగర్ RK నాయుడు హీరోగా పద్మశ్రీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘షాదీ ముబారక్’ సినిమా  ట్రైలర్ రిలీజైంది. పెళ్లి చూపుల కోసం అమెరికా నుండి వచ్చిన ఎన్నారై  మాధవ్ సున్నిపెంట, అతనితో ప్రేమలో పడే అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య సాగే చక్కని ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ కానుందనిపిస్తుంది. అలాగే సాగర్ కి కూడా ఈ సినిమా హీరోగా మంచి గుర్తింపు అందించేలా ఉంది.

సినిమాలో హైలైట్ గా నిలిచే హీరో -హీరోయిన్ ట్రావెల్ సన్నివేశాలతో పాటు మ్యూజిక్ , విజువల్స్ ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా హీరో ఇంటి పేరుతో హీరోయిన్ చేసే కామెడీ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంది. సినిమాలో యువత మెచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ఓవరాల్ గా రెండు నిమిషాల నిడివితో కూడిన ఈ ట్రైలర్ మార్చ్ 5 న ప్రేక్షకులు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడబోతున్నారని చెప్పేలా ఉంది.