Shaadi Mubarak Teaser సింపుల్ & స్వీట్

Tuesday,February 16,2021 - 01:27 by Z_CLU

సీరియల్ యాక్టర్ సాగర్ ఆర్ కే నాయుడు హీరోగా మారి చేస్తున్న ‘షాదీ ముబారక్’ రిలీజ్ కి రెడీ అవుతుంది. మార్చ్ 5న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.  పద్మశ్రీ డైరెక్షన్ లో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న షాదీ ముబారక్ టీజర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ మంచి వ్యూస్ అందుకుంటోంది.

తన ఇంటి పేరుతో విసుగెత్తిన ఒక అమ్మాయి తనకు కాబోయే వాడి ఇంటి పేరు ఎంతో అందంగా ఉండాలని కోరుకునే  ఎలిమెంట్ తో సరదాగా ప్రారంభమైన టీజర్ లో హీరో- హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు , శ్రీకాంత్ విజువల్స్ , సునీల్ కాశ్యప్ మ్యూజిక్  ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. హీరోయిన్ ద్రిశ్య క్యారెక్టర్ సినిమాకు హైలైట్ కానుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. అలాగే సాగర్ కి మంచి డెబ్యూ ఫిలిం అవుతుందనిపిస్తుంది. నిమిషం లోపు నిడివితో విడుదలైన ఈ టీజర్ ఓవరాల్ గా సింపుల్ అండ్ స్వీట్ అనిపిస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేలా ఉంది.