సీక్వెల్స్ 2017

Wednesday,February 08,2017 - 11:09 by Z_CLU

సీక్వెల్స్ కల్చర్ సౌత్ లోనూ ఊపందుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ఫార్ములా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా హల్ చల్ చేస్తోంది. అలా ఈ ఏడాది ఏకంగా 6 సీక్వెల్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

sequel-_-2

సూర్య కెరీర్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ సింగం. ఏ ముహూర్తాన సింగం స్టార్ట్ చేశాడో కానీ, అప్పట్నుంచి తీస్తున్న ప్రతి పార్ట్ హిట్ అవుతోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో పార్ట్ తో రెడీ అయిపోయాడు సూర్య. తమిళ్ లో సింగం-3, తెలుగులో యముడు-3 పేరుతో ఇది రేపు విడుదలకానుంది. ఇది సక్సెస్ అయితే కచ్చితంగా సింగం-4 కూడా ఉంటుందంటున్నారు మేకర్స్.

sequel-_-3

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 2.0. ఈ సినిమా కూడా సీక్వెలే. గతంలో రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ ఇది. రజనీకాంత్-ఎమీజాాక్సన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.

sequel-_-4

ఇక మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ బాహుబలి-2 కూడా సీక్వెలే. రాజమౌళి డైరక్ట్ చేస్తున్న ఈ భాారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం ఇండియాలో అందరి దృష్టి ఈ సీక్వెల్ పైనే ఉందంటే, బాహుబలి పార్ట్-1 ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

sequel-_-5
ఈ నెలలోనే సెట్స్ పైకి రాబోతోంది మరో సీక్వెల్ రాజుగారి గది-2. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన రాజుగారి గది సినిమాకు సీక్వెల్ గా పార్ట్-2 రాబోతోంది. మొదటి భాగంలో స్టార్ డమ్ లేదు. కానీ సీక్వెల్ లో మాత్రం కింగ్ నాగార్జున ఉన్నాడు. నాగ్ కాబోయే కోడలు సమంత కూడా ఉంది. అందుకే రాజుగారి గది-2 ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

sequel-_-6

తెలుగు-తమిళ భాషల్లో హిట్ అయిన వీఐపీ-2 కూడా ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉంది. ధనుష్-అమలా పాల్ హీరోహీరోయిన్లుగా నటించిన వీఐపీ సూపర్ హిట్ అయింది. రఘువరన్ బీటెక్ పేరిట తెలుగులోకి కూడా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు రఘువరన్ బీటెక్ పార్ట్-2 తెరకెక్కుతోంది.

sequel-_-8

ఈ సీక్వెల్స్ తో పాటు… 2017లో కనువిందు చేయబోతున్న మరో సీక్వెల్ సామి-2. విక్రమ్ హీరోగా గతంలో వచ్చిన సామి సినిమా ఘనవిజయం సాధించింది. ఇదే సినిమాలో తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ పేరుతో రీమేక్ కూడా అయి, ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ సిద్ధమౌతోంది.

sequel-_-7

మరికొన్ని చిన్న సినిమాలు కూడా సీక్వెల్స్ గా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన అడల్ట్ క్రైమ్ కామెడీ మూవీ గుంటూరు టాకీస్ కు సీక్వెల్ వస్తోంది. ప్రవీణ్ సత్తార్ డైరక్ట్ చేసిన ఈ సినిమా తొలి భాగంలో రష్మి అందాలు ఆరబోస్తే… సీక్వెల్ కోసం ఏకంగా సన్నీ లియోన్ నే లైన్లో పెట్టారు.

sequel-_-1

సీక్వెల్ గా వస్తున్న మరో చిన్న సినిమా సన్నాఫ్ లేడీస్ టైలర్. సరిగ్గా పాతికేేళ్ల కిందట వచ్చిన లేడీస్ టైలర్ సీక్వెల్ కు సీక్వెల్ గా ఈ మూవీని తీయబోతున్నాడు దర్శకుడు వంశీ. గతంలో ఈ సీక్వెల్ కోసం రవితేజ నుంచి రాజ్ తరుణ్ వరకు ఎంతోమంది హీరోల్ని అనుకున్నారు. పైనల్ గా ఈ సీక్వెల్ లో నటించే అవకాశం సుమంత్ అశ్విన్ కు దక్కింది.