సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ

Saturday,March 09,2019 - 12:01 by Z_CLU

ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా నలుగుతున్న సినిమా కార్తికేయ-2. నిఖిల్, చందు మొండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ అవ్వడంతో, ఆ సినిమాకు సీక్వెల్ చేస్తామని వీళ్లిద్దరూ చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. కానీ సరైన స్క్రిప్ట్ సెట్ అవ్వక ప్రాజెక్టు డిలే అయింది. ఎట్టకేలకు ఈ సినిమాకు లైన్ సెట్ అయింది.

కార్తికేయ-2 సినిమాకు సంబంధించి కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేశాడట దర్శకుడు చందు మొండేటి. ప్రస్తుతం నిఖిల్, దర్శకుడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయట. నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో నిఖిల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత కార్తికేయ-2పై క్లారిటీ రానుంది.