దేవదాస్ కు సీక్వెల్ వస్తుందా..?

Friday,September 21,2018 - 12:40 by Z_CLU

మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది దేవదాస్ సినిమా. నాగార్జున, నాని నటించిన ఈ మల్టీస్టారర్ మూవీపై ఫిలింనగర్ లో చాలా బజ్ నడుస్తోంది. ఇప్పుడు దీనికి మరో క్రేజీ ఎలిమెంట్ యాడ్ చేశాడు నాగార్జున. నానితో కలిసి ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ఎనౌన్స్ చేశాడు.

దేవదాస్ మ్యూజిక్ పార్టీ పేరిట రాత్రి ఎన్-కన్వెన్షన్ లో ఆడియో రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన నాగార్జున, దేవదాస్ పార్ట్-2 తీద్దామని అని నానిని అందరి ముందు కోరడం, నాని ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మరోసారి ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెడితే దేవదాస్-2 రావడం గ్యారెంటీ.

దేవదాస్ మ్యూజిక్ పార్టీ గ్రాండ్ గా జరిగింది రాత్రి. హీరోయిన్లు రష్మిక, ఆకాంక్షతో పాటు నాగ్ భార్య అమల, కోడలు సమంత ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్లతో పాటు సడెన్ గా అఖిల్ కూడా ప్రత్యక్షమవ్వడంతో పార్టీ మరింత కలర్ ఫుల్ గా మారింది. క్రిష్, వంశీ పైడిపల్లి, సుశాంత్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.