సీక్వెల్ రెడీ నిర్మాత కావాలి

Wednesday,February 12,2020 - 09:17 by Z_CLU

టాలీవుడ్ లో పాథ్ బ్రేకింగ్ మూవీగా పేరుతెచ్చుకుంది “అ!”. కాజల్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అలా అందర్నీ ఆకర్షించిన ఈ మూవీకి సీక్వెల్ వస్తోంది. అవును.. “అ!” సినిమాకు సీక్వెల్ రాశానని ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

“అ! సినిమాకు సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తయింది. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత క్రేజీగా వచ్చింది. కాకపోతే అంత క్రేజీ నిర్మాత మాత్రం దొరకలేదు. అ!కు సీక్వెల్ ఎప్పుడొస్తుందో అప్పుడే చెప్పలేను.”

ఇలా సీక్వెల్ విషయాన్ని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. కేవలం ఈ సినిమా కథ నచ్చి నిర్మాతగా మారాడు నాని. అతడి ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నారు. ఇప్పుడా సినిమా సీక్వెల్ ను కూడా నాని నిర్మిస్తాడేమో చూడాలి.