#SBSB - సెంటిమెంట్ తో వస్తున్న సాయితేజ్

Saturday,December 19,2020 - 03:57 by Z_CLU

సాయి తేజ్ హీరోగా నటించిన Solo Brathuke So Better రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది.. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా తేజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే సాయి తేజ్ కి ఈ డేట్ సెంటిమెంట్ గా మారింది.

గతేడాది సరిగ్గా ఇదే సీజన్ కి ‘ప్రతి రోజు పండగే’ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ అదే క్రిస్మస్ సీజన్ కి ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో థియేటర్స్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఆ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. మరోవైపు ఎన్ని కావాలంటే అన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి.

సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే కంటెంట్ కూడా ఉందని ఇప్పటికే టీం గట్టిగా చెప్తోంది. ముఖ్యంగా సాయి ధరం తేజ్ , నభా మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్ అవ్వనుందని అంటున్నారు.

SVCC బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. Zee Studios సంస్థ ద్వారా సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.