ఈ 'లీడర్' కు 9 ఏళ్లు

Tuesday,February 19,2019 - 04:01 by Z_CLU

హీరోగా కెరీర్ ప్రారంభించి ఇవాళ్టికి 9 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు ఈ ఆరడుగుల ఆజానుబాహుడు. అవును.. రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన లీడర్ సినిమా విడుదలైన నేటికి (19/02/2010) సరిగ్గా 9 సంవత్సరాలు అవుతోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పొలిటికల్ జానర్ లో క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. లీడర్ వచ్చే టైమ్ కే ఎన్నో పొలిటికల్ సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత కూడా మరెన్నో సినిమాలు ఈ జానర్ లో వచ్చాయి. కానీ లీడర్ స్థానం దానిదే. ఈ సినిమాను మైమరిపించే పొలిటికల్ మూవీ ఇంకా రాలేదు.

ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాతో హీరోగా ఫిక్స్ అయిపోయాడు రానా. కెరీర్ లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలుపుకొని 25కి పైగా సినిమాలు చేసిన రానా, ఇప్పటికీ లీడర్ సినిమాను ప్రత్యేకంగా చూస్తాడు. కేవలం డెబ్యూ మూవీ అని మాత్రమే కాదు, అందులో ఉన్న కంటెంట్ అలాంటిది.