కొత్తగా ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్స్

Saturday,May 04,2019 - 01:53 by Z_CLU

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ని ఏలేసిన వాళ్ళే. కొన్ని రోజులు అలా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారో లేదో మళ్ళీ కరెక్ట్ టైమ్ చూసుకుని సరైన సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో సీనియర్ ఆడియెన్స్ దృష్టి కూడా ఈ సినిమాలపై నిలుస్తుంది.

 టాబూ : అల్లు అర్జున్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది టాబూ. ఈ సినిమాతో పాటు రానా విరాట పర్వం సినిమాలో కూడా నెగెటివ్ రోల్ ప్లే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. టాబూ స్పీడ్ చూస్తుంటే వరస సినిమాలు చేసి మళ్ళీ పాత క్రేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టే అనిపిస్తుంది.

విజయ శాంతి : అనిల్ రావిపూడికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలీదు కానీ విజయశాంతి ఇక ఆల్మోస్ట్ సినిమాలు చేయదు అని ఫిక్సయిన టైమ్ లో, మహేష్ బాబు సినిమాలో క్యారెక్టర్ ఆఫర్ చేశాడు. విజయ శాంతి కూడా అంతే తొందరగా ఓకె అనడంతో ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ సీనియర్ హీరోయిన్.

నిరోషా : హీరోయిన్ గా సినిమాలు తగ్గించిన తరవాత కూడా కొన్ని సినిమాల్లో మదర్ రోల్ ప్లే చేసింది. తెలుగులో అయితే తరుణ్ హీరోగా చేసిన ఒక ఊరిలోసినిమాలో కూడా నటించింది. మళ్ళీ ఆ తర్వాత కనబడలేదు. మళ్ళీ  ఇన్నాళ్ళకు నువ్వు తోపురాసినిమాలో నటించింది నిరోషా. అవకాశాలు రావాలే కానీ మళ్ళీ బిజీ ఆవ్వాలనే ఆలోచనలో ఉంది.