'సీనయ్య' కు హీరోయిన్ ఫిక్సయిందా ?

Sunday,February 02,2020 - 12:05 by Z_CLU

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా మారి ‘సీనయ్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసారు. ఇక ఆర్టిస్టులను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.

సినిమాలో వినాయక్ భార్యగా నటించేందుకు ఓ ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ ను అనుకున్నారు. అయితే ఫైనల్ గా సంగీతను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఒకప్పటి హీరోయిన్ గా సంగీత అందరికీ పరిచయమే. లేటెస్ట్ గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో రష్మిక తల్లి పాత్రతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉంది.