సీనియర్లతో యంగ్ హీరోస్

Wednesday,June 27,2018 - 11:58 by Z_CLU

మల్టీస్టారర్ కు ఇప్పుడు అర్థం మారింది. బాలయ్య-చిరంజీవి కలిసి నటిస్తేనే మల్టీస్టారర్ కాదు. అదే బాలయ్య,మంచు మనోజ్ తో సినిమా చేశాడు. నాగార్జున-వెంకీ కలిసి నటిస్తేనే మల్టీస్టారర్ కాదు. అదే నాగార్జున ఇప్పుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇలా సీనియర్లు, యంగ్ స్టర్స్ కలిసి సరికొత్త మల్టీస్టారర్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

నాగార్జున-నాని

నాగార్జునకు మల్టీస్టారర్స్ కొత్తకాదు. మరో బడా హీరో సినిమాలో గెస్ట్ రోల్స్ చేయడం కూడా కొత్త కాదు. కానీ యంగ్ స్టర్స్ తో కలిసి సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం కాస్త కొత్తే. మొన్నటికిమొన్న ఊపిరిలో కార్తితో కలిసి నటించిన నాగ్, ఇప్పుడు నానితో ఓ సినిమా చేస్తున్నాడు. నాగ్ లాంటి సీనియర్, నాని లాంటి యంగ్ హీరో కలిసి
నటిస్తున్నారు కాబట్టే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కేక్ గా మారింది

వెంకీ-వరుణ్ తేజ్

ఇక్కడ కూడా పెద్దోడు, చిన్నోడు కలిశారు. 75 సినిమాలకు దగ్గరైన వెంకటేష్.. పట్టుమని 10 సినిమాల అనుభవం కూడా లేని వరుణ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇద్దరికీ క్రేజ్ ఉండడం, రెండు తరాల ఆడియన్స్ ను కనెక్ట్ చేయడం ఈ మల్టీస్టారర్ స్పెషాలిటీ

బాలయ్య-రానా

ఇలాంటిదే మరో మల్టీస్టారర్ రాబోతోంది. ఈసారి బాలయ్య, రానా కలిసి మెరవబోతున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య. ఇందులో ఓ కీలక పాత్రలో రానా కనిపించబోతున్నాడు. రానా ఈ ప్రాజెక్టులో ఉన్న విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కానీ బాలయ్య-రానా కాంబో దాదాపు సెట్ అయినట్టే


వెంకీ-నాగచైతన్య

ఇది కూడా రెండు తరాలకు చెందిన కాంబినేషనే. తన మేనమామ వెంకీతో కలిసి చైతూ ఓ సినిమా చేయబోతున్నాడు. బాబి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా.

మొత్తమ్మీద ఇలా సీనియర్లంతా, యంగ్ హీరోస్ తో మల్టీస్టారర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇంకా చేరని సీనియర్ ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ మాత్రమే. మెగాహీరోలతో కలిసి మెగాస్టార్ చేయబోయే మల్టీస్టారర్ కోసం మెగాఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిటింగ్