ఈ ఏడాది సీనియర్ల హంగామా

Friday,January 12,2018 - 01:16 by Z_CLU

యంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నప్పటికీ సీనియర్లు మాత్రం తమ సత్తా చాటుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ చిరంజీవి కూడా రీఎంట్రీ ఇవ్వడంతో సీనియర్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

ఖైదీనంబర్ 150తో రికార్డులు సృష్టించిన చిరంజీవి ఈ ఏడాది సైరాతో మనముందుకు రాబోతున్నారు. చిరు కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందంటున్నారు మెగాస్టార్.

 

మరో సీనియర్ హీరో బాలయ్య కూడా ఈ ఏడాది తన సత్తా చూపించబోతున్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే ఈ నందమూరి నటసింహం ఈ ఏడాదికి గాను ఇప్పటికే జైసింహాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. త్వరలోనే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బోయపాటి డైరక్షన్ లో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది.

 

మరో సీనియర్ హీరో నాగ్ కూడా రేసులో ఉన్నాడు. ఆర్జీవీ డైరక్షన్ లో ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు నాగ్. ఈ మూవీతో పాటు ఈ ఏడాది ఓ మల్టీస్టారర్ మూవీలో కూడా కనిపించబోతున్నాడు. నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే వస్తున్నాయి.

వెంకటేష్ కూడా ఈ ఇయర్ 2 సినిమాలు ప్లాన్ చేశాడు.  గురు లాంటి సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. తేజ దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ స్టార్ట్ చేస్తాడు. ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. మధ్యలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడు.  ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్న ఈ 3 సినిమాల్లో 2 కచ్చితంగా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తాయి.