దీపావళి కి సీనియర్స్ హంగామా

Sunday,October 30,2016 - 09:20 by Z_CLU

ఈ ఏడాది దీపావళి మొత్తం సీనియర్ హీరోలదే. అప్పట్లో పోటాపోటీగా సినిమాలు విడుదల చేసి అభిమానుల్లో ఉత్కంఠ పెంచి, రసవత్తర పోటీ నెలకొల్పిన మన సీనియర్ హీరోలు… మళ్లీ ఇన్నేళ్లకు ఒకేసారి ఈ దీపావళికి కలిశారు. పోటాపోటీగా తమ కొత్త సినిమాల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు.

stars-2

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తను నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. చాలా ఏళ్ల తరువాత చిరు హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ పోస్టర్స్ చూసి సంబరపడిపోతున్నారు మెగా అభిమానులు. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న నందమూరి నటసింహం బాలయ్య… మరోసారి దీపావళి సందర్బంగా తన ప్రతిష్టాత్మక 100 వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.

stars-3

చిరు, బాలయ్యతో పాటు… ఈ దీపావళికి మిగతా ఇద్దరు సీనియర్లు నాగార్జున, వెంకటేశ్ కూడా రెడీ అయిపోయారు. తన లేటెస్ట్ సినిమా ‘గురు’ పోస్టర్ తో వెంకీ దీపావళి విషెష్ చెబితే… తన కొత్త సినిమా ఓం నమో వేంకటేశాయ స్టిల్ తో నాగార్జున కూడా ప్రేక్షకులకు మరోసారి చేరువయ్యాడు. ఇలా ఈ దీపావళికి సీనియర్లంతా ఒకేసారి బరిలోకి దూకడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.