సీనియర్లు.. బిజీ... బిజీ  

Sunday,July 29,2018 - 10:01 by Z_CLU

చిరంజీవి ,  బాలయ్య, వెంకటేష్, నాగార్జున  ప్రస్తుతం ఈ నలుగురు హీరోలు నాలుగు సినిమాలతో బిజీ అయిపోయారు. ఇటివలే వీరి అప్ కమింగ్ మూవీస్ ను సెట్స్ పైకి తీసుకొచ్చిన  ఈ నలుగురు ఒకే సారి బిజీ అయ్యారు. చిరు ప్రస్తుతం ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి కథతో  ‘సైరా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… బాలయ్య కూడా తన తండ్రి కథతో ‘NTR’ సినిమా చేస్తున్నాడు.. నాగార్జున , వెంకటేష్ ఇద్దరూ చెరో  మల్టీ స్టారర్ సినిమాతో సెట్స్ పై ఉన్నారు. ఈ సినిమాలతో పాటు నెక్స్ట్ చేయబోయే సినిమాలను కూడా లైనప్ లో పెట్టేస్తున్నారు.

‘సైరా’ తర్వాత కొరటాల శివ తో ఓ సినిమా చేయబోతున్నాడు చిరు . బాలయ్య కూడా ‘NTR’ అవ్వగానే వినాయక్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు. వెంకటేష్ కూడా నెక్స్ట్ సినిమాలను లైన్ లో పెట్టేసాడు. అందులో ఒకటి నాగ చైతన్య తో చేసే మల్టీ స్టారర్ కాగా మరొకటి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా… నాగ్ ప్రస్తుతం  ‘దేవదాస్’ తో పాటు బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. ఇలా ఒకదాని తర్వాత మరొక సినిమా ప్లాన్ చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు.

ఇక నాగార్జున ‘దేవదాస్’ సినిమాతో ఇదే ఏడాది సెప్టెంబర్ లో సందడి చేయనుండగా  బాలయ్య నటిస్తున్న ‘NTR’ వచ్చే ఏడాది సంక్రాంతి కి రానుంది. వెంకటేష్ కూడా జనవరి లోనే ‘F2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాలయ్య, వెంకీ  సంక్రాంతి సీజన్ కి ఫిక్స్ అయితే చిరు మాత్రం వేసవి సెలవులపై కన్నేశాడు. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్ళీ పలకరించబోతున్నాడు మెగా స్టార్. సో ప్రస్తుతం ఈ నలుగురు సీనియర్లు నాలుగు సినిమాలతో బిజీ విజీ గా గడుపుతూ పక్కా ప్లానింగ్ తో దూసుకెల్తున్నారు.