ఎడిటర్ గౌతం రాజు ఇక లేరు

Wednesday,July 06,2022 - 11:53 by Z_CLU

చిత్ర పరిశ్రమలో 24 శాఖల్లో పనిచేసే చాలా మంది టెక్నీషియన్స్  సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తూ తెరవెనుకే  ఉండిపోతుంటారు.  అందులో  ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ అయితే ఎక్కువ మందికి తెలియదు. కానీ ఈ క్రాఫ్ట్ కి వన్నె తెచ్చి తాము సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చాటి చెప్పిన టాప్ ఎడిటర్స్ లో గౌతం రాజు ఒకరు. ఎందఱో స్టార్ హీరోలతో , దర్శక , నిర్మాతలతో పనిచేసి తన కత్తెర పనితనంతో వారి మెప్పు పొందిన సీనియర్ ఎడిటర్ గౌతం( 68) రాజు ఇక లేరు.

కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న ఆయన  నిన్న అర్థ రాత్రి మరణించారు. తమ సినిమాలకు కత్తెర పెట్టి వాటిని అందంగా ఆకట్టుకునే విధంగా చూపించిన గౌతం రాజు మరణ వార్త విని తెలుగు సినిమా ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఆయనకి  నివాళులు అర్పిస్తున్నారు.  గౌతం రాజు గారు చాలా సౌమ్యుడు. మితభాషి. ఏ సినిమా ఫంక్షన్ కి వచ్చిన స్పీచ్ ఇవ్వకుండానే స్టేజి నుండి దిగిపోతారు. తను కాకుండా పని మాట్లాడాలనుకునే వ్యక్తి. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ , తమిళ్ , కన్నడ భాషల్లోనూ ఎడిటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. ఎడిటర్ గా 800 పైగా సినిమాలకు పనిచేసిన గౌతం రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ నివాళి అందిస్తుంది ‘జీ సినిమాలు’.

 

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics