వీళ్ళిద్దరికీ ఇది స్పెషల్ సంక్రాంతి

Friday,November 01,2019 - 10:03 by Z_CLU

టాబూ.. విజయశాంతి ఈ ఏడాది సంక్రాంతి వీళ్ళిద్దరికీ చాలా చాలా స్పెషల్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోయిన వీళ్ళిద్దరూ లాంగ్ గ్యాప్ తరవాత మళ్ళీ సిల్వర్ స్కీన్ పై కనిపించబోతున్నారు. టాబూ అల్లు అర్జున్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంటే, విజయశాంతి సూపర్ స్టార్ సినిమాతో మెస్మరైజ్ చేయబోతుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయ శాంతి కీ రోల్ అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు, ఆడియెన్స్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. ఇంతమంది సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తున్నా విజయశాంతి ఎక్కడా సినిమాల ప్రస్తావన తీసుకురాకపోవడంతో కనీసం కలలో కూడా ఈ రాములమ్మను మళ్ళీ ఆన్ స్క్రీన్ చూస్తామనుకోలేదు ఫ్యాన్స్. అయితే అనిల్ రావిపూడి ఈ ఫాంటసీని రియాల్టీ లోకి ట్రాన్స్ ఫామ్ చేశాడు. అద్భుతమైన క్యారెక్టర్ ఆఫర్ చేయడంతో ఈ లేడీ సూపర్ స్టార్ నో అనే మాట కూడా ఎత్తకుండా సంతకం చేసేసింది.

ఇక టాబూ విషయానికి వస్తే త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి ఉండే ఇంపాక్టే వేరు. సినిమా హీరో రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఈ క్యారెక్టర్ కి కూడా అంతే డెప్త్ ఉంటుంది. అలాంటి గ్రేస్ ఫుల్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయబోతుంది టాబూ.

ఒకరు మహేష్ బాబు సినిమాలో, మరొకరు బన్ని సినిమాలో… కానీ వచ్చేది మాత్రం సంక్రాంతికే. అందునా ఒకే రోజు. అందుకే ఈ సారి సంక్రాంతి మరింత స్పెషల్ కానుందనిపిస్తుంది.