సమంతా ప్లేస్ లో సీనియర్ నటి లక్ష్మి

Friday,January 11,2019 - 02:28 by Z_CLU

సమంతా చేయాల్సిన రోల్ లో సీనియర్ నటి లక్ష్మి నటించనుందా..? నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మిస్ గ్రానీ’ రీమేక్ లో 70 ఏళ్ల ముసలావిడగా లక్ష్మి నటించనుంది. నిజానికి ఈ క్యారెక్టర్ కూడా సమంతానే చేయాలి కానీ లాస్ట్ మూమెంట్ లో ఫిల్మ్ మేకర్స్, ఈ మేజర్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ కీలకం. అనుకోకుండా 70 ఏళ్ల ముసలావిడ ఆత్మ, 20 ఏళ్ల అమ్మాయిలో చేరడంతో జెనెరేట్ అయ్యే హిలేరియస్ ఎలిమెంట్సే ఈ సినిమా. అయితే సమంతా మాత్రం ఈ సినిమాలో రెగ్యులర్ కి భిన్నంగా, ఓ వైపు గ్లామరస్ గా కనిపిస్తూనే, 70 ఏళ్ల ముసలావిడ ఆటిట్యూడ్ లో కనిపించనుంది.

బిగినింగ్ లో ప్రొస్తెటిక్ మేకప్ తో సమంతాని గ్రానీ లా ప్రెజెంట్ చేయాలనుకున్న మేకర్స్, ఈ క్యారెక్టర్ కి లక్ష్మి అయితేనే బెటర్ అని ఫిక్సయినట్టున్నారు. అయితే ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య మరో కీ రోల్ లో కనిపించనున్నాడు.