Chandra Mohan - నేను ఆరోగ్యంగానే ఉన్నాను

Tuesday,May 25,2021 - 07:33 by Z_CLU

సీనియర్ నటుడు చంద్రమోహన్ హెల్త్ పై 2 రోజులుగా రూమర్స్ వచ్చాయి. ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని, ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. వీటిని చంద్రమోహన్ ఖండించారు. ఈరోజు ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేసిన చంద్రమోహన్.. తను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానని ఎనౌన్స్ చేశారు.

ఈమధ్యే 80 ఏళ్లు పూర్తిచేసుకొని, 81వ ఏట అడుగుపెట్టారు చంద్రమోహన్. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో స్థిరపడిన రచయితలంతా జూమ్ లో సమావేశమై.. చంద్రమోహన్ సినిమాలపై విశ్లేషణ చేశారు. ఆయన నటనను కొనియాడారు. ఆ తర్వాత కొన్ని రోజులకే చంద్రమోహన్ ఆరోగ్య దెబ్బతిన్నట్టు పుకార్లొచ్చాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు చంద్రమోహన్. పుట్టినరోజు నాడు తనకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతూనే.. తన ఆరోగ్యం కూడా బాగున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు పెరగడంతో ఆయన సినిమాల్లో నటించడం ఆపేశారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics