తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో డాన్స్ బేస్డ్ లవ్ స్టోరీ

Monday,February 10,2020 - 03:03 by Z_CLU

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ను మీడియాతో పంచుకున్నాడు కమ్ముల.

“ఈసారి టిపికల్ లవ్ స్టోరీ తీసుకున్నాను. నా సినిమాల్లో ప్రేమికుల మధ్య కాన్ ఫ్లిక్ట్ చాలా చిన్నదిగా, సరదాగా ఉంటుంది. కానీ ఈసారి చాలా స్ట్రాంగ్ కాన్ ఫ్లిక్ట్ పాయింట్ తీసుకున్నాను. మా సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. అందుకే సెట్స్ కు వెళ్లకుండా.. తెలంగాణ రియల్ లొకేషన్స్ లో తీశాం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరిగే డాన్స్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది.”

“తెలంగాణలోని రెండు పల్లెల నుంచి వచ్చిన ఇద్దరు హైదరాబాద్ లో కలుసుకుంటారు. ఇద్దరికీ డాన్స్ అంటే ఇష్టం. తమ కెరీర్ కలల్ని సాకారం చేసుకోవడం తో పాటు.. ఎలా ప్రేమలో పడ్డారనే విషయాన్ని ఇందులో చూపిస్తున్నాం. దీని కోసం హీరోహీరోయిన్ల మధ్య వర్క్ షాప్ చేయిస్తున్నానని అంతా అనుకుంటున్నారు. అది వర్క్ షాప్ కాదు. దాన్ని నేను రీడింగ్ సెషన్ అంటారు. స్క్రిప్ట్ ఎంత బాగా చదువుకుంటే అంత బాగా నటించొచ్చు. నాగచైతన్య, సాయిపల్లవి అదే చేశారు.”

సాధారణంగా కమ్ముల సినిమాలు హీరోయిన్ సెంట్రిక్ గా సాగుతుంటాయి. కానీ లవ్ స్టోరీ మాత్రం నాగచైతన్య చుట్టూ తిరుగుతుందని, ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర అందర్నీ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నాడు శేఖర్ కమ్ముల.