సీరత్ కపూర్ ఇంటర్వ్యూ

Tuesday,October 10,2017 - 07:35 by Z_CLU

కింగ్ నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాజుగారి గది 2’ ఈ నెల 13 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అటు హారర్ ఎలిమెంట్స్, ఇటు ఫ్యామిలీ ఇమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ లో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీరత్ కపూర్ ఈ సినిమాకి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలతో పాటు, తన గురించి కూడా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీ కోసం….

పెద్దగా నటించలేదు

రాజుగారి గది 2 సినిమాలో నా క్యారెక్టర్ గురించి పెద్దగా ఇప్పుడే రివీల్ చేయలేను కానీ, ఎగ్జాక్ట్ గా రియల్ లైఫ్ లో నేనేంటో అలాంటి క్యారెక్టరే ప్లే చేశాను. నిజం చెప్పాలంటే పెద్దగా నటించాల్సిన అవసరమే లేదు. చాలా న్యాచురల్ గా అనిపించింది.

అస్సలు తొందరపడను

కొలంబస్ తరవాత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. ఈ గ్యాప్ లో నేందో బాలీవుడ్ సినిమాలపైనే కాన్సంట్రేట్ చేస్తున్నాను, టాలీవుడ్ పై ఫోకస్ చేయట్లేదు లాంటి న్యూస్ లు కూడా చాలా వచ్చాయి. కానీ నిజమేంటంటే నేను న్యాచురల్ గానే స్పీడ్ ని బిలీవ్ చేయను. కొంచెం తొందర పడకుండా నిదానంగా డెసిషన్స్ తీసుకుంటాను. అందుకే ఈ గ్యాప్.

అందుకే ఈ చాన్స్ నాకు వచ్చింది

ఒక సినిమాకి స్క్రిప్ట్, సెటప్ ఎంత అవసరమో, దానికి సంబంధించి ప్రతి ఎలిమెంట్ కూడా అంతే స్పెషల్. ఈ సినిమాలో నేను ప్లే చేసిన క్యారెక్టర్ విషయంలోనే కాదు, ప్రతి చిన్న విషయంలోను చాలా సెన్సిబుల్ గా, పర్టికులర్ గా ఉంటారు. ఈ క్యారెక్టర్ కోసం నన్ను ఎంచుకోవడానికి రీజన్ నా ప్రీవియస్ సినిమాలు ‘రన్ రాజా రన్’ తో పాటు ‘కొలంబస్’ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి, ఈ సినిమాలో ఆయన విజన్ కి నేను రీచ్ అవ్వగలను అనిపించి నాకీ చాన్స్ ఇచ్చారు.

నాగ్ తో ఎవ్వరితోనైనా ఈజీగా కనెక్ట్ అయిపోతారు

నాగార్జున గారు చాలా జోవియల్ గా ఉంటారు. అయన దగ్గర ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఉంటుంది. నాతో బిగినింగ్ లో మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ మూవీ కొరియోగ్రాఫర్ ఆష్లే లోబో అన్న వశ్యం చెప్పారు. నేను ఆక్చువల్ గా ఆ డ్యాన్స్ అకాడమీ లోనే డ్యాన్స్ నేర్చుకున్నాను. అంత పెద్ద స్టార్ అన్న ఫీలింగ్ అసలు ఆయనకు ఉండదు. డైరెక్టర్ దగ్గర నుండి స్పాట్ బాయ్ వరకు ఎవ్వరితోనైనా ఆయన న్యాచురల్ గా కనెక్ట్ అయిపోతారు.

ఫ్లాప్స్ తో సంబంధం లేదు…

కొలంబస్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఆ సినిమా విషయంలో ఇప్పటికీ రిగ్రేట్స్ లేవు. ఇప్పటికీ ఆ సినిమాలో నేను ప్లే చేసిన నీరు క్యారెక్టర్ కి క్రిటిక్స్ నుండి కూడా మంచి అప్రీసియేషన్స్ దొరికాయి. సో ఫ్లాప్స్, సక్సెస్ చాలా కామన్, కొత్త విషయాలు నేర్చుకుంటూ మూవ్ ఆన్ అవ్వడాన్నే నేను నమ్ముతాను…

 

ఆ ఆలోచనే తప్పు

ఒక ఫోటో ని సరిగ్గా గమనిస్తే ఒక్కో ఫోటోలో ఒక్కో కాన్సెప్ట్ ఉంటుంది. కనీ రీసెంట్ గా నా ఫోటోషూట్ విషయంలో కాన్సెప్ట్ ఏంటి..? అనే దానికన్నా నా డ్రెస్ విషయంలోనే ఎక్కువ డిస్కషన్స్ జరుగాయి. అయినా నేను అందరి అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇస్తాను, అదే విధంగా అమ్మాయిలూ వేసుకునే డ్రెస్ ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయడాన్ని డెఫ్ఫినేట్ గా అపోజ్ చేస్తాను.

ప్రస్తుతానికి మూడు సినిమాలు

V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు శిరీష్ సినిమాలో చేస్తున్నాను, దాంతో పాటు దగ్గుబాటి రానా ప్రొడక్షన్ లో రవికాంత్ పేరేపు డైరెక్షన్ లో సినిమాతో పాటు, రవితేజ టచ్ చేసి చూడు సినిమాల్లో నటిస్తున్నాను.