స్వచ్ఛమైన స్నేహం వెనక అసలు కథ...

Wednesday,September 28,2016 - 10:00 by Z_CLU

ఎన్టీఆర్-రాజమౌళి స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆ స్వచ్చమైన స్నేహం వల్ల ఎన్టీఆర్ తో రాజమౌళి నానాయాతన పడ్డ సిచ్యువేషన్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వాస్తవాన్ని బయటపెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం రాదనుకున్నాడేమో తీరిగ్గా ట్వీట్ చేశాడు రాజమౌళి.

ntr-rajamouli

స్టూడెంట్ నంబర్ వన్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు… తారక్, రాజమౌళి ఒకే గదిలో ఉండాల్సి వచ్చిందట. సర్లే అని సరిపెట్టుకుంటే రాత్రి తొమ్మిదింటికి గంట కొట్టినట్టు పడుకునే అలవాటు ఉన్న జక్కన్న ఓ వైపు, పన్నెండింటి వరకు ఏ ఛానల్ టెలీకాస్ట్ అవ్వకపోతే అగ్రికల్చరల్ ఛానలే సరి అనుకుని చూస్తూ కూర్చునే తారక్ ఓ వైపు. ఎంత బతిమాలుకున్నా రాత్రి పన్నెండయ్యాక కానీ తారక్ టి.వి స్విచ్చాఫ్ చేయలేదట. అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు మండిపోతుంటుంది అని ట్వీటాడు రాజమౌళి. ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి ఇలాంటివన్నీ స్వీట్ మెమోరీస్ అకౌంట్ లోనేగా పడతాయి. అందుకే తిట్టినా కూడా ఆ ట్వీట్… తారక్ కు స్వీట్ గానే అనిపించింది.