నా పేరు సూర్య: రెండో పాట రెడీ

Friday,February 09,2018 - 12:49 by Z_CLU

ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక సాంగ్ తో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్… ఇప్పుడు ‘లవర్ ఆల్సో’ అంటూ తనలోని ప్రేమను పంచబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ప్రేమికుల దినోత్సవ కానుక రెడీ చేస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రంలోని ‘లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో’ అనే పాటను వాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. విశాల్ శేఖర్ తమదైన స్టయిల్ లో అద్భుతమైన సంగీతమిచ్చారు. ఈ పాటను అల్లు అర్జున్, హీరోయిన్ అనూ ఎమ్మాన్యూయేల్ పై అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు.

మొదటి పాటగా రిలీజ్ చేసిన ‘సైనిక’… ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో…. రెండో పాటగా రిలీజ్ కానున్న లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో అనే పాట కూడా అంతే హిట్ అవ్వడం గ్యారెంటీ. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. బన్నీ వాసు సహ నిర్మాత. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 27న నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.