ఛల్ మోహన్ రంగ: సెకెండ్ సింగిల్ రిలీజ్

Saturday,March 03,2018 - 11:20 by Z_CLU

“ఫస్టు లుక్కు సోమవారం, మాట కలిపే మంగళవారం” అంటూ నితిన్ తన ప్రేయసితో ఉన్న అనుబంధాన్ని  శ్రోతలతో పంచుకున్నారు. ఛల్ మోహన్ రంగ సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాట సంగతులివి.

‘నితిన్ మేఘ ఆకాష్’ జంటగా నటిస్తున్న చిత్రం ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“గ ఘ మేఘ” పాటతో జనాలకి మరోసారి మంచి మెలోడీ అందించిన థమన్ ఈసారి మంచి డాన్స్ నెంబర్ తో వచ్చాడు. సాహిత్య అవార్డ్ గ్రహీత  కేదారనాథ్ ఈ పాటను రచించగా, నాకాష్ అజీజ్ తన స్వరంతో పాటను శ్రోతలకి మరింత చేరువుగా తీసుకొచ్చారు. నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.