డేట్ ఫిక్స్: జెర్సీ నుంచి సెకెండ్ సాంగ్

Tuesday,March 05,2019 - 11:22 by Z_CLU

నాని హీరోగా నటిస్తున్న జెర్సీ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది. హార్ట్ టచింగ్ సింగిల్ అనిపించుకుంది. అదే ఊపులో ఇప్పుడు సెకెండ్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఎల్లుండి (మార్చి 7) ఈ సినిమా సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు.

అదేంటో గానీ ఉన్నపాటుగా అనే లిరిక్స్ తో సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా విడుదల చేశారు. ఇదొక రొమాంటిక్ ట్యూన్. ఇక స్పిరిట్ ఆఫ్ జెర్సీ పేరిట సెకెండ్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఎనౌన్స్ మెంట్ తో పాటు సినిమాకు సంబంధించి మరో బ్రాండ్ న్యూ స్టిల్ కూడా విడుదల చేశారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది జెర్సీ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో శ్రద్ధాశ్రీనాధ్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న జెర్సీ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతోంది.