సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

Friday,February 24,2017 - 06:05 by Z_CLU

బోయపాటి మరో సరైన మాస్ ఎంటర్ టైనర్ తో సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.  బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకున్న రెండో షెడ్యూల్ కి కూడా సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది. బ్యాంకాక్ లో వరసగా 30 రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, రెండు పాటలతో పాటు, సినిమాలోని  కొన్ని కీలక సన్నివేశాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించింది.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ని ఊరమాస్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన సాయి శ్రీనివాస్ స్టైలిష్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చేసరికి సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బోయపాటి ఫ్యామిలీ అండ్ యాక్షన్ మార్క్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారు.