సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ హీరోయిన్స్

Wednesday,February 27,2019 - 05:40 by Z_CLU

కరియర్ పీక్ లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుంది స్నేహ. ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోల సరసన  నటించేసింది. అయితే పెళ్ళి తరవాత కొంత కాలం బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ అదే స్థాయిలో అంతే సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకుంటుంది. రీసెంట్ గా  ‘వినయ విధేయ రామ’ సినిమాలో, రామ్ చరణ్ కి వదినగా నటించిన స్నేహ,  సెకండాఫ్ లో మెచ్యూర్డ్  పర్ఫామెన్స్  తో వన్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వరసలో మరికొంతమంది హీరోయిన్స్ ఉన్నారు.

భూమిక : MCA లో నానికి వదినగా నటించింది భూమిక. ఆల్మోస్ట్ సినిమా ఈ 2 క్యారెక్టర్స్ మధ్యే నడుస్తుంది. ఆ తరవాత వచ్చిన యూటర్న్, సవ్యసాచి సినిమాల్లో కూడా జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే అన్నట్టుగా కాకుండా, సినిమాలో కీ రోల్ ప్లే చేసి మెస్మరైజ్ చేసింది.

మీనా : రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ లో నటించింది మీనా. అంతకుముందు వెంకటేష్ సరసన ‘దృశ్యం’ లో ఇన్నోసెంట్ వైఫ్ లా, న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

 

ఇంద్రజ : ఇక ఇంద్రజ కూడా ఈ వరసలో స్పీడ్ మీదుంది. రీసెంట్ గా ‘శతమానం భవతి’ లో గుర్తుండిపోయే రోల్ లో మెస్మరైజ్ చేసిన ఇంద్రజ, ఆ తరవాత హ్యాప్పీ వెడ్డింగ్, అజ్ఞాతవాసి సినిమాల్లోను నటించింది.

కళ్యాణి : స్టార్ సినిమాల్లో కొంచెం ఎమోషనల్ డోస్ ఉన్న క్యారెక్టర్ అనగానే చాలామంది ప్రిఫర్ చేసేది కళ్యాణి నే. విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ లో మిడిల్ క్లాస్ వదినగా కనిపించినా, రీసెంట్ గా ‘యాత్ర’ సినిమాలో కష్టాల్లో ఉన్న తల్లిలా నటించినా, కళ్యాణి నే బెస్ట్ చాయిస్ అనిపించుకుంది.

 

ఆమని : నాని MCA లో పిన్నిగా నటించింది. ఈ సినిమాలో కనిపించేది కొన్ని సీన్స్ లోనే అయినా నాని, ఆమని కాంబినేషన్ లో ఉండే హిలేరియస్ సీన్స్, సినిమాకే హైలెట్ గా నిలిచాయి. రీసెంట్ గా ‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ కి తల్లిగా నటించింది ఆమని.