Sebastian - కొత్త కథ, సరికొత్త లుక్

Sunday,December 27,2020 - 10:12 by Z_CLU

హీరోగా పరిచయమైన ‘రాజావారు రాణివారు’తో ప్రేక్షకులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలను ఆకట్టుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. హీరోగా రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’ పాటలతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడు నటిస్తున్న మూడో చిత్రం ‘సెబాస్టియన్‌ పి.సి. 524’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్‌ అబ్బవరాన్ని చూపించడం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్‌’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్‌ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

ఇంతకీ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలుసా..? నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలో వస్తున్న డిఫరెంట్ స్టోరీ ఇది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు.

జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఆయన సంగీతం అందిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

‘సెబాస్టియన్‌ పి.సి. 524’లో కిరణ్‌ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారని గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్‌ డ్రస్‌లో క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్‌ రోజున జన్మించిన క్రిస్టియన్‌ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్‌ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్‌ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు.

కిరణ్ అబ్బవరం సరసన నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.