ప్రభాస్ కోసం సెర్చింగ్ !

Tuesday,February 28,2017 - 09:04 by Z_CLU

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించబోయే నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా లో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా…అనే ప్రశ్న ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మే చివరి వారంలో (లేక) జూన్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.. ఇక ఈ సినిమా కోసం ఇప్పటివరకూ టాలీవుడ్ కి పరిచయం లేని హీరోయిన్స్ అయితే బెటర్ అని భావిస్తున్న మేకర్స్ ప్రెజెంట్ ఆ హీరోయిన్స్ ను వెతికే పనిలో పడ్డారట.. తాజాగా  ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానితో పాటు మరో ముంబై హీరోయిన్ ను కూడా సంప్రదిస్తున్నారని సమాచారం… మరి ఈ ఆరడుగుల అందగాడి సరసన నటించే ఆ భామలెవరో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.