యంగ్ టాలెంట్ ను ప్రోత్స హించనున్న సుకుమార్

Thursday,August 18,2016 - 02:30 by Z_CLU

ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ వెండి తెర పై తమ సత్తా చాటుతున్నారు. సుజీత్,శ్రీరామ్ ఆదిత్య,మేర్లపాక గాంధీ,నాగ అశ్విన్ తదితరులంతా ఈ కోవా కి చెందిన వారే. తాజాగా ‘పెళ్లి చూపులు’ చిత్రం తో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అందుకే ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిలిం మేకర్స్ తో సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు. తాజాగా సుకుమార్ కూడా ఇలా యువ దర్శకులను ప్రోత్సహించడానికి సిద్ధమయ్యారు.. అభిషేక్ పిక్చర్స్ సంస్థ తో కలిసి ఒక టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నారు సుకుమార్ . యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తెరకెక్కించే షార్ట్ ఫిలిమ్స్ ను “talent@abhishekpictures.com”  అనే మెయిల్    కి పంపిస్తే అందులో నుండి కొందరు జ్యూరి సభ్యులచే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ను ఎంపిక చేసి ప్రసాద్స్ ఐమాక్స్ లో ప్రదర్శించి ఫైనల్ విన్నర్స్ కు సినిమా అవకాశం కల్పించనున్నారు సుకుమార్ మరియు అభిషేక్ సంస్థ.