నా కెరీర్ లోనే పెద్ద సినిమా ఇది

Thursday,October 25,2018 - 11:52 by Z_CLU

సవ్యసాచి సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు. ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైతూ, సవ్యసాచి సినిమా భారీ స్థాయిలో తెరకెక్కడానికి కారణం నిర్మాతలే అంటున్నాడు.

“ఈ ప్రాజెక్టు ఇంత భారీగా రావడానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే. వాళ్ల వల్లనే సవ్యసాచి స్కేల్ పెరిగింది. నేను చందు ఈ సినిమాను నార్మల్ స్కేల్ లో తీద్దామనుకున్నాం. మైత్రీ నిర్మాతలు వచ్చిన తర్వాతే కీరవాణి వచ్చారు. మాధవన్ కూడా వచ్చారు.”

ఈ సినిమా అవకాశం తనకు వస్తుందని అనుకోలేదంటున్నాడు నాగచైతన్య. చందు మొండేటి క్యూజువల్ గా కథ చెప్పాడని, తనతో తీస్తాడని మాత్రం అస్సలు అనుకోలేదన్నాడు.

“ప్రేమమ్ షూటింగ్ టైమ్ లో సవ్యసాచి స్టోరీ లైన్ చెప్పాడు. బాగుందనుకున్నాను. నాతో చేస్తే బాగుంటుందని ఫీలయ్యాను. కానీ అప్పుడు నేను అడగలేదు. ప్రేమమ్ రిలీజ్ తర్వాత చందూనే మళ్లీ వచ్చి అడిగాడు. వెంటనే ఓకే చేశాను.”

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా కనిపిస్తున్నాడు. భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది సవ్యసాచి